శృంగార సంకీర్తన
రేకు: 378-3
సంపుటము: 11-465
రేకు: 378-3
సంపుటము: 11-465
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎవ్వరికిఁ దెలుసు నీ యిట్టి మాయలు రవ్వలుగాఁ జూడఁ బోతే రంటికిని వత్తువూ | ॥పల్లవి॥ |
నగవులు సారె నీకు నవ్వ వచ్చుఁ గాక మాకు పగ సవతులచేతఁ బడ వచ్చునా పగలుమేలము చాలు పద వోయి నీ కేమి తగులువిరికాఁడవు దక్కినట్టే వుందువూ | ॥ఎవ్వరికి॥ |
చేఁత లెల్లఁ జేసి నీకుఁ జెక్కు నొక్క వచ్చుఁగాక బాఁతిపడి విరహనఁ బడఁ గలమా లేఁతమాట లాడ వద్దు లేవోయి వలపులు పాఁతగిలితేఁ జాలు పనులే మరతువూ | ॥ఎవ్వరికి॥ |
గతి గూడి నీకు మమ్ముఁ గాఁగిలించ వచ్చుఁ గాక అతివలయు నిన్ను రమ్మన నోపేమా సతమై శ్రీవెంకటేశ చన విచ్చి కూడితివి యిత వయినచోటికి నీ వెట్టయినఁ జేతువూ | ॥ఎవ్వరికి॥ |