Display:
శృంగార సంకీర్తన
రేకు: 402-1
సంపుటము: 12-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
యేమి సేతు నీ మీఁద నెంతైనా నాస మానదు
మామీఁది వలపు నీకు మరపాయఁగా
॥పల్లవి॥
చేరి నీతో మాటలాడి సేవలు సేసుకొంటా
యీరీతినే నుండినది యిది చాలక
కారించి యిందు మీఁదను కాఁకలు చల్లఁ జూచేవు
గారవపు నీదయ కాన వచ్చెఁగా
॥॥
కన్నులు చల్లఁగఁ జూచి కడు నీతో నవ్వుకొంటా
యెన్నికగా నే నుండిన దిది చాలక
మిన్నక నీ విందుమీఁద మేకులు సేయఁ జూచేవు
మన్నించెనన్న నీ మాటపట్టు మీరెఁగా
॥॥
అప్పటప్పటికి నిన్ను నట్టే కౌఁగిలించుకొంటా
యిప్పుడు గూడివుండిన దిది చాలక
అప్పుడ శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
కప్పేవు పచ్చడము నీ గతి గంటిఁ గా.
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము