Display:
శృంగార సంకీర్తన
రేకు: 419-1
సంపుటము: 12-109
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
యెఱిగించరే పతికి యీ సుద్దు లెల్లాను
కఱకఱి సేసితేను గయ్యాళి యందురు
॥పల్లవి॥
మలసి తన కెదురు మాట లాడుటకంటే
చెలిచే మనవి చెప్పించేదే మేలు
పలుమారుఁ దన్నుఁ జూచి పచ్చారుకంటేను
తలవంచుక తన ముందర నుండుటే మేలు
॥॥
తడివి మందెమేళానఁ దనతో నవ్వుటకంటే
వొడికమై సిగ్గుతోడ నుండుటే మేలు
పడిఁబెట్టి సారె సారె సరస మాడుటకంటే
వుడివోని బత్తితోడ నుమ్మగిలుటే మేలు
॥॥
ఆనుకొని తన్ను రతి నలయించుటకంటే
పానుపుపై దండ నిట్టే పండుటే మేలు
నే నలమేలుమంగను తాను శ్రీ వేంకటేశుఁడు
మేనంటి తా నన్నుఁ గూడి మెఱయుటే మేలు.
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము