Display:
శృంగార సంకీర్తన
రేకు: 419-2
సంపుటము: 12-110
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
వేడుకతో నుండుఁ గాని వేసరీఁ జుమ్మీ
జాడతో నా విన్నప మిచ్చట వినుమనవే
॥పల్లవి॥
వనితలు తనుఁ గంటే వదలి వూరకుందురా
పెనఁగక తక్కుదురా ప్రియముతోను
చనవునఁ బై పై సరస మాడక విడుతురా
వొసర నన్నిటికిని వోరుచు కొమ్మనవే
॥॥
ఆయములు సోకిఁతే నాసలఁ బోనిత్తురా
పాయపు మదముతోడఁ బాయఁగలరా
చేయి చాఁచి నవ్వక సిగ్గులు వడుదురా
యీయెడ మా కోరికె లీడేర్చు మనవే
॥॥
నిచ్చలు రతి వేళల నేరుపు మరతురా
విచ్చన వీడైన చోట నీఁగుదురా
ఇచ్చట శ్రీ వేంకటేఁశు డే నలమేలుమంగను
మచ్చికతో నన్నుఁ గూడె మన్నించు మనవే.
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము