అధ్యాత్మ సంకీర్తన
రేకు: 8-1
సంపుటము: 1-49
రేకు: 8-1
సంపుటము: 1-49
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
కొనుట వెగ్గళము దాఁ దినుట యల్పము మీఁదు- [1]గనుట వినుట లేక దా కడచన్న భవము | ॥కొనుట॥ |
ఆపద వడ్డికినిచ్చి అనుభవింపఁబోయిన యేపున నెవ్వరికి నిం దేమి గలదు పాపపు పైరు విత్తిన పండిన పంటలలోన రూపింపఁగ నిందు రుచి యేమి గలదు | ॥కొనుట॥ |
ఘనుఁడైన తిరువేంకటనాథుఁ డిన్నిటికి- యును భోక్తయుఁ గర్మియును నైనవాఁడు పనిలేదు నిష్ఠూరపరుఁడు దానై వుండు తనకుఁ దానె కర్త తనమౌటఁ గాన | ॥కొనుట॥ |
[1] ‘గనుట వినుటలే కదా’ అని పూ.ము.పా.