శృంగార సంకీర్తన
రేకు: 471-2
సంపుటము: 12-362
రేకు: 471-2
సంపుటము: 12-362
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఔనయ్య మంచివాఁడ వండకు వచ్చినదాని పూని యలయించే వింత కోపునటవయ్యా | ॥పల్లవి॥ |
తనువెల్ల జెమరించె దప్పి దేరె మోవి మీఁద ననుపున నింతి నెంత నవ్వించేవయ్యా పెనగొనె హారములు బేఁట్లు రాలె గందము చెనకి యప్పటి నేల సిగ్గు రేఁచేవయ్యా | ॥॥ |
వెలయఁ దురుము జారె వేడుకల దగ దొట్టె చలాల నెంత సేసలు చల్లించేవయ్యా పులకలు గడు నిండె పోఁక ముడి వీడెను అలరి యెంత వసంతా లాడించేవయ్యా | ॥॥ |
కాటుక కప్పు దేరె గక్కనఁ బయ్యె దెడలె సూటి నెంత చిత్తరువు చూపించేవయ్యా గాటాన శ్రీ వేంకటేశ కౌఁగిలించుకొంటి విట్టే మాటి మాటికి నెంత మరిగించేవయ్యా | ॥॥ |