Display:
శృంగార సంకీర్తన
రేకు: 471-5
సంపుటము: 12-365
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాగవరాళి
వేవేలు సతులు గల విభుఁడవు
సేవలు సేయకుండితే చిత్తగించేవా
॥పల్లవి॥
విన్నపాలు సేసితే వేడుకలు రేఁగును
కన్నులెదుట నుండితేఁ గనుపట్టును
సన్నలు సేసితేను చవులెల్ల నొనగూడు
మన్నింతు వంటా రాకుంటే మాటలాడేవా
॥॥
కతలు సారెఁ జెప్పితే కైవసమౌ నేస్తము
తతి వేళ గాచితేను దయ వుట్టునూ
రతికెక్కఁ గొలిచితే రచన లెల్లా నీడేరు
అతి రాజసాన నుంటే నంటి నవ్వేనా
॥॥
పాదము లొత్తితేను భావములు గరఁగును
పోదితోఁ జెనకితేను పొడముఁదమి
యీ దెస శ్రీ వేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
పాదుకొని లోన నుంటే బాఁతి పడేవా
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము