అధ్యాత్మ సంకీర్తన
రేకు: 101-1
సంపుటము: 2-1
రేకు: 101-1
సంపుటము: 2-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
విచారించు హరి నావిన్నప మవధరించు పచారమే నాది గాని పనులెల్లా నీవే | ॥పల్లవి॥ |
తనువు నా దెందుఁ గాని తనువులో నింద్రియములు అనిశము నాచెప్పినట్టు సేయవు మనసు నాదెందుఁ గాని మర్మము నాయిచ్చ రాదు పనివడి దూరు నాది పరులదే భోగము | ॥విచా॥ |
అలరి నానిద్దుర నాదెందుఁ గాని సుఖమెల్ల కలలోని కాఁపిరాలకతల పాలె తెలివి నాదెందుఁ గాని దినాలు కాలము సొమ్ము యెలమిఁ బేరు నాది యెవ్వరిదో బలువు | ॥విచా॥ |
కర్మము నాదెందుఁ గాని కర్మములో ఫలమెల్ల అర్మిలి నాజన్మముల ఆధీనమె ధర్మపు శ్రీవేంకటేశ దయానిధివి నీవు నిర్మితము నీదింతే నేరుపు నీమాయది | ॥విచా॥ |