Display:
శృంగార సంకీర్తన
రేకు: 473-4
సంపుటము: 12-376
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
యేఁటికి దూరె విటు నన్ను నీ-
నాఁటకములు గని నవ్వితిఁ గాకా
॥పల్లవి॥
చలమా నీతో సరి పెనఁగఁగ నీ
కొలఁ దెఱుఁగక నేఁగొంకేఁ గాకా
బలిమా నే నీ పయిఁజేయి వేయఁగ
చెలిమికత్తెనై చెలఁగేఁ గాకా
॥॥
నీటా నీతో నివ్వెఱఁ గందఁగ
జూటరి యాసలఁ జూచేఁ గాకా
సాటి వచ్చెనా చనవు నీ వియ్యఁగ
కూటువని సరీఁ గూచుండేఁ గాకా
॥॥
యెదురా గుబ్బల నిటునే నొత్తఁగ
అదనని కౌఁగిట నలమేఁ గాకా
యిదివో శ్రీ వేంకటేశ నన్నేలితి(వి)
పొదుగఁగ నీ నేర్పు పొగడీఁ గాకా
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము