Display:
శృంగార సంకీర్తన
రేకు: 474-4
సంపుటము: 12-382
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
యేల మూసీ మంతనాలు యెదిరించి నా పనికి
వాలాయ మింత గలిగితే వద్దనేమా నేము
॥పల్లవి॥
సందడి నుండీతని సారెకుఁ జూడఁగ నేల
ముందరికి వచ్చి యిటు మొక్కగదవే
పొందుగా సన్నల వలపులు చల్ల నీ కేల
అందుకొనీఁ గాని బాగా లంపవే నీవు
॥॥
చెలుల మాటున నుండి సిగ్గులు వడఁగ నేల
అలరి మాట లాడుదు వండకు రావే
నిలిచి కొలువు సేసి నివెవ్వఱఁగు వడనేల
బలిమిఁ గిందఁ గూచుండి పాదా లొత్తవే
॥॥
పయ్యద మఱఁగుననే పచ్చినవ్వు నవ్వ నేల
చయ్యనఁ గూడి మోవి చవి చూపవే
యియ్యెడ శ్రీ వేంకటేశుఁడిన్నిటాను నన్నుఁగూడె
చెయ్యార నీవు ననుపు సేసుకొనవే
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము