Display:
శృంగార సంకీర్తన
రేకు: 514-2
సంపుటము: 13-78
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
నీవే యిఁకఁ గరుణించవయ్యా
భావించి కత లేర్పరచఁగఁ గలరా
॥పల్లవి॥
మనసులోని నీమతకములెల్లా
కనుఁగొనఁగలరా కామినులు
వెనుకొని నీవొళ్లి వేసములింతేసి
దినదినమును నిటు తెలియఁగఁ గలరా
॥నీవే॥
నలుగడ నీ విటు నవ్విన నవ్వులు
తలఁచఁగఁ గలరా తగు సతులు
నెలకొని నీరతినేర్పుల చేఁతలు
కొలఁదులు వెట్టుక కొసరఁగఁ గలరా
॥నీవే॥
శ్రీవేంకటేశ్వర జిగి నీ మహిమలు
సేవించఁగలరా చిన్నెకలు
వావిరి నందరి వరుస నేలితివి
వావులు దెలుపుచు వారించఁ గలరా
॥నీవే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము