శృంగార సంకీర్తన
రేకు: 517-2
సంపుటము: 13-96
రేకు: 517-2
సంపుటము: 13-96
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎవ్వరుఁ జెప్పరు నీకు నేమిసేసేది జవ్వనపాయముగా సటలు రేఁచేది | ॥పల్లవి॥ |
పంతము నీవాడేవట పట్టరాదా యెగ్గు మేము యెంతనేరుపరివి నిన్నేమిచెప్పేది అంతదొరవు నీవైతే నాఁడువారు సదరమా దొంతుల యీతగవేల తోఁచదో కాక | ॥ఎవ్వ॥ |
రావాడి గోరూఁదేవట రాసి నే జంకించరాదా యేవల్ల నేర్చితివి నిన్నేమిచెప్పేది నీవే చదువనేర్చితే నెలఁతలు తుచ్చమైర యీవేళ నీవిచారము యేలలేదో కాని | ॥ఎవ్వ॥ |
తక్కక కూడితివట తమకించరాదా నేను యెక్కడఁగలిగె బుద్దు లేమిచెప్పేది నిక్కి దేవరవై తేనే నీవారుగారా సతులు ఇక్కువ శ్రీవేంకటేశ యేల మంకో కాక | ॥ఎవ్వ॥ |