అధ్యాత్మ సంకీర్తన
రేకు: 9-2
సంపుటము: 1-56
రేకు: 9-2
సంపుటము: 1-56
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
[1]నగుఁబాట్లఁ బడే నా జిహ్వ పగటున నిదివో పావనమాయ | ॥నగు॥ |
ఇల నిందరి నుతియించి పెంచువలె నలినలియైనది నా జిహ్వా నలినోదరు శ్రీనామము దలఁచిన ఫలమున కిదివో పావనమాయ | ॥నగు॥ |
భ్రమఁబడి మాయపు పడఁతుల తమ్మలు నమలి చవులుగొనె నా జిహ్వా అమరవంద్యుఁడగు హరి నుతియించఁగ ప్రమదము చవిగొని పావనమాయ | ॥నగు॥ |
నెలఁతల పలుయోనిద్రవనదులను నలుగడ [2]నీఁదెను నా జిహ్వా అలసి వేంకటనగాధిప యనుచును పలికినయంతనె పావనమాయ | ॥నగు॥ |
[1] ‘నగుఁబాట్లఁ బడెనా జిహ్వా’ అని పూ.ము.పా.
[2] ‘నిండెను’ అని పూ.ము.పా.