అధ్యాత్మ సంకీర్తన
రేకు: 9-3
సంపుటము: 1-57
రేకు: 9-3
సంపుటము: 1-57
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం, యేకతాళి
విడుమనవో రోలు విడుమనవో వేగ విడుమనవో తల్లి వెఱచీ [1]నీబాలుడు | ॥విడు॥ |
యెన్నఁడు గొల్లెతల యిండ్లు వేమారుఁ జొచ్చి వెన్నలుఁ బాలును [2]వెఱఁజఁడు వన్నెల నీకోప మింత వద్దు నీకు [3]నీయాన కన్నుల నవ్వుల ముద్దుగారీ నీబాలుడు | ॥విడు॥ |
సారెకు పెరుగుల చాడెలూ నేఁడు మొదలూ గోరయై కోలలఁ బగుల మొత్తఁడు కూరిమిలేక నీవు కోపగించఁగాఁ గన్నీరు జోరుగా రాలఁగా నిన్నే చూచీ నీబాలుఁడు | ॥విడు॥ |
చాలు నీకోప మిది సరిలేని మద్దులివి రోలనే [4]యిట్లను విరుగఁద్రోయఁడు మేలిమివేంకటపతి మేఁటి నీకొమాఁరు డిదె కేలెత్తి నీకు మ్రొక్కెడి నిదె బాలుఁడు | ॥విడు॥ |
[1] ‘వెఱచీని + ఈ బాలుఁడు’ అంతటా ఇంతే.
[2] ‘వెఱఁజండు’ అని పూ.ము.పా.
[3] ‘నియ్యాన’ రేకు. ‘నీ+ఆన’ ఇదియొక వింత త్రికసంధి. ఈ వాఙ్మయమున అక్కడక్కడ గలదు.
[4] ‘నీట్లను’ కావచ్చు.