అధ్యాత్మ సంకీర్తన
రేకు: 9-4
సంపుటము: 1-58
రేకు: 9-4
సంపుటము: 1-58
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి, రచ్చెతాళం
పట్టవసముగాని బాలుఁడా పెనుఁ- బట్టపుబలువుఁడ బాలుఁడా | ॥పట్ట॥ |
ఇరుగడ బ్రహ్మయు నీశ్వరుఁడును నిన్ను సరుస నుతింప జఠరమున అరుదుగ నుండి ప్రియంబున వెడలిన పరమమూర్తివా బాలుఁడా | ॥పట్ట॥ |
తల్లియుఁ దండ్రియుఁ దనియని ముదమున వెల్లిగ లోలో వెఱవఁగను కల్లనిదురతోఁ గనుమూసుక రే- పల్లెలోఁ బెరిగిన బాలుఁడా | ॥పట్ట॥ |
యేదెసఁ జూచిన నిందరి భయముల సేదలు దేఱఁగఁ జెలగుచును వేదపల్లవపు వేంకటగిరిపై పాదము మోపిన బాలుఁడా | ॥పట్ట॥ |