శృంగార సంకీర్తన
రేకు: 612-6
సంపుటము: 14-72
రేకు: 612-6
సంపుటము: 14-72
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నీతోఁ బెనఁగదు నిన్ను నౌఁగాదనదు నీ తలఁపు దెలియక నిట్టూర్పు వుచ్చీని | ॥పల్లవి॥ |
పక్కన నీవాపెను పయ్యదకొంగు వట్టితే చెక్కునఁ జెయి వెట్టుక సిగ్గుపడీని చక్కఁగా నప్పటి గోరు చన్నులపై నూఁదితేను నెక్కొన్న వేడుకతోడ నివ్వెరగందీని | ॥నీతో॥ |
తొడిఁబడ నీవాపెను తొడపైకిఁ దీసుకొంటే చిడుముడి మేనెల్లాఁ జెమరించీని తడఁబడి యట్టె మోము తప్పక చూచితేను పొడలుగాఁ జెక్కులెల్లాఁ బులకించీని | ॥నీతో॥ |
సారె సారె నీవాపెతో సరసములాడఁగాను గారబాన నిన్నందుకుఁ గాఁగిలించీని యీ రీతి శ్రీ వేంకటేశ యింతి నిట్టె కూడితివి నీ నేరుపులెల్లా మించ నిన్ను మెచ్చీని | ॥నీతో॥ |