అధ్యాత్మ సంకీర్తన
రేకు: 10-1
సంపుటము: 1-61
రేకు: 10-1
సంపుటము: 1-61
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
పదిలము కోట పగవారు అదనఁ గాచుకొందు రాఱుగురు | ॥పదిలము॥ |
ఇమ్మైఁ జెప్ప యిందరిచేత తొమ్మిదినెల్లఁ దోఁగినది కొమ్మతీరునఁ గుదురైన కోట దొమ్మికాండ్లైదుగురుందురు | ॥పదిలము॥ |
వొంటికాఁడు రాజు వుడుగక తమలోన [1]వొంటనీని మంత్రులొక యిద్దరు దంటతనంబునఁ దమ యిచ్చఁ దిరిగాడు బంటు లేడుగురు బలవంతులు | ॥పదిలము॥ |
కలవు తొమ్మిది [2]కనుమల తంత్రము నిలుపఁగలిగినట్టి నెరవాదులు తెలిసి కోనేటి తిమ్మినాయఁడు చొచ్చె బలిసె యీ కోట భయమేల | ॥పదిలము॥ |
[1] ‘ఒంటని నీ మంత్రు’ అని పూ.ము.పా.
[2] ‘కనుమలు’ తంత్రము కావచ్చునేమో? నెరవాదులు కనుమలకు విశేషణము?