శృంగార సంకీర్తన
రేకు: 652-2
సంపుటము: 14-308
రేకు: 652-2
సంపుటము: 14-308
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్రం
వలసినప్పుడు మేము వచ్చేముగాని మలసి మమ్మీవేళ మన్నించరయ్యా | ॥పల్లవి॥ |
తరుణిచిత్తము నీతలఁపు కొలఁదే కాక యెరవుల మామాట యేఁటికయ్యా వొరసి బుద్దులు చెప్పి వొకరి వారముగాము మరిగి వుండేరు మీరే మరి మేమేలయ్యా | ॥వల॥ |
అంగన చలము మీ అలుకకోలఁదే కాక సంగతిగాని నూపొందు చాలునయ్యా వెంగలిచేఁతల మొక్కి విదిలింపించుకొంటిమి ముంగిటనుండేము మాతో మొగమోటేలయ్యా | ॥వల॥ |
వనితప్రియము నీవలపు కొలఁదే కాక తనిసితిమి మానీటు దక్కెనయ్యా చనవున మీకు మీకే చక్కనై కూడితిరిదే ననిచి శ్రీవేంకటేశ నవ్వు నవ్వేమయ్యా | ॥వల॥ |