శృంగార సంకీర్తన
రేకు: 652-5
సంపుటము: 14-311
రేకు: 652-5
సంపుటము: 14-311
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కుంతలవరాళి
ఇంతకు వచ్చినమీఁద నిఁకనేల మొగమోట చింతదీర నిన్ను నేమి సేసినానుఁ జెల్లదా | ॥పల్లవి॥ |
యీగతి నిద్దిరించేవు యిట్టె నావద్దికి వచ్చి వేగుదాఁకా నీ పొందు వెగటా నీకు చేగదేరనిని ఆడఁ జేయ మరచి వచ్చితా ఆగడపునిన్ను దూరనట్టె నాకుఁ ఖల్లదా | ॥ఇంత॥ |
పన్ని తల నొచ్చీనంటాఁ బైపైనిట్టె మూలిగేవు విన్నవించే నామాట వేసటా నీకు యిన్నేసి మాయలు సేయనీడనే నేరిచితివా కన్నచోట నీగుణాలు కాకుసేయఁ జెల్లదా | ॥ఇంత॥ |
చెల్లినంతాఁ జేసి వచ్చి చేయివట్టి పెనఁగేవు పల్లదాన నే నేఁడు బాఁతే నీకు వొల్లనే శ్రీవేంకటేశ వూరడించి కూడితివి చల్లజంపులను నిన్ను జంకించఁ జెల్లదా | ॥ఇంత॥ |