శృంగార సంకీర్తన
రేకు: 652-6
సంపుటము: 14-312
రేకు: 652-6
సంపుటము: 14-312
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
కటకట యిఁకనేల కాఁక రేఁచేవు అటమటములు చాలునప్పటి నా మాటలు | ॥పల్లవి॥ |
నేరుపు మెరసి వచ్చి నేఁడు నన్నుఁ బిలిచేవు వూరివారిముందరనే, వోరీ పోరా యేరా నే నిన్నెరఁగనా యింతబత్తిగలవాఁడ- వారసి నన్నేల పట్టేవప్పటి నామాఁటలు | ॥కట॥ |
తొడిఁబడ నీకెవ్వతే దొరకకుంటే వచ్చి వొడివట్టి తీసేవు వోరీ పోరా తడఁబడ నీవల్ల తనిసితిమన్నిటాను అడియాలమిదే కంటిమప్పటి నామాటలు | ॥కట॥ |
ముక్కుతిక్కులకుఁ దెచ్చి మోము చూచినవ్వినాతో వొక్కటైతివింతలోనే వోరీ పోరా చక్కని శ్రీవేంకటేశ జాణవవుదువిన్నిటాను అక్కరదీరఁ గూడితివప్పటి నామాఁటలు | ॥కట॥ |