అధ్యాత్మ సంకీర్తన
రేకు: 39-6
సంపుటము: 15-224
రేకు: 39-6
సంపుటము: 15-224
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: గుండక్రియ
నన్ను నిన్ను నెంచుకోవో నారాయణా అన్నియు నీ చేతినే అదివో నారాయణా | ॥పల్లవి॥ |
నా మన సెఱుఁగవా నారాయణా నేఁడు నాము లాయె వయసులు నారాయణా నామధారికపు మొక్కు నారాయణా ఆముకొని నీ ప్రియము లందునే నారాయణా | ॥నన్ను॥ |
నగుతా నే నంటి నింతే నారాయణా యిదె నగ రెఱిఁగినపని నారాయణా నగవులు మాకుఁ జాలు నారాయణా అగడుసేయకు మిఁక నప్పటి నారాయణా | ॥నన్ను॥ |
ననలు నీ వినయాలు నారాయణా, మంచి నను పంటి మిదివో నారాయణా ఘనుఁడ శ్రీవేంకటాద్రిఁ గలసితి విట్లైనను అనుమాన మెల్లాఁ బాసె నందు నారాయణా | ॥నన్ను॥ |