అధ్యాత్మ సంకీర్తన
రేకు: 41-6
సంపుటము: 15-236
రేకు: 41-6
సంపుటము: 15-236
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: ఆహిరి
మాయింటికి రావోయి మాధవా, నీ మాయలెల్లాఁ గంటి మిదె మాధవా | ॥పల్లవి॥ |
మచ్చు చల్లేవు వలపు మాధవా నేను మచ్చిక లెల్లాఁ జేసితి మాధవా మచ్చెము నీపై నిదె మాధవా యింక మచ్చరపు చూపు నలో మాధవా | ॥మాయిం॥ |
మఱుఁ గేల యింక నీకు మాధవా మఱి నాకు దక్కితివి మాధవా మఱచేవానిచేఁతలు మాధవా మాతో మఱచు మాటే మనేవు మాధవా | ॥మాయిం॥ |
మట్టులేని శ్రీవేంకట మాధవా కట్టు మట్టుతో మమ్ముఁ గూడితి మాధవా మట్టేవు మా కాళ్లప్పటి మాధవా మట్టె లియ్యఁగద వోయి మాధవా | ॥మాయిం॥ |