శృంగార సంకీర్తన
రేకు: 702-1
సంపుటము: 16-7
రేకు: 702-1
సంపుటము: 16-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
అందు కెంత గడించేవే ఆతనిమీఁద పందెము వేయఁగా చేయి పట్టెఁగాక | ॥పల్లవి॥ |
ఘనుఁ డాతఁ డేమైనా కాముకుఁడా చెలితోను ననుపున నూరకే నవ్వెఁగాక అనిశ మందరువంటి ఆరజపువాఁడా చెనకి పెనఁగఁగాను చేతనంటెఁ గాక | ॥అందు॥ |
యిన్నిటా సరసుఁ డీతఁ డెమ్మెకాఁడా, ఆవనిత చన్నులు మోపఁగా సరసమాడెఁగాక సన్నల నందరిమీఁదాఁ జల్లే జాజర కాఁడా కన్నెవు పంతమాడఁగాఁ గప్రాన వేసెఁగాక | ॥అందు॥ |
రసికుఁడాతఁడు కాతరపువాఁడా మానినులు కొసరి పైకొనఁగాను కూడెఁగాక యెగ శ్రీవేంకటేశుఁ డితఁడె మాయేలిక సుసరాన నిన్ను నేవె సుగుణ గాక | ॥అందు॥ |