శృంగార సంకీర్తన
రేకు: 703-4
సంపుటము: 16-16
రేకు: 703-4
సంపుటము: 16-16
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
అప్పటి నాసపడేవు అంగనలకు పిప్పిగాఁ గొంగువట్టి పెనఁగేవా రెవ్వరు | ॥పల్లవి॥ |
తొడమీఁదఁ గూచుండి తొయ్యలి నీతో నవ్వఁగా యెడ చొచ్చి మాటాడే దెవ్వతె యిఁక విడువ కాపె నీవద్ద వెఁస గాచుకుండఁగాను చిడుముడి నూడిగాలు సేసేవా రెవ్వరు | ॥అప్ప॥ |
చనవున నెలయించి సన్న లాపె సేయఁగాను యెనయ నిన్నుఁ బిలిచే దెవ్వతె ఇఁక మునుపనే నిన్నుఁగోరి మోమే ఆపె చూడఁగాను వొనర మందె మేళాన నొరసేవా రెవ్వరు | ॥అప్ప॥ |
కాఁపురము సేసేయాపె కాఁగిలించుకుండఁగాను యేపున నిన్నుఁ జెనకే దెవ్వతే యిఁక ఆపె గూడె శ్రీవేంకటాద్రిఁ బ్రహ్లదవరద కాపాడి నన్నేలితివి కాదనేవా రెవ్వరు | ॥అప్ప॥ |