శృంగార సంకీర్తన
రేకు: 747-2
సంపుటము: 16-272
రేకు: 747-2
సంపుటము: 16-272
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
నాఁటి వలపులు నేఁడు నానఁ బెట్టేవా వాఁటమాయ నీ సుద్దులు వంక లొత్తవలెనా | ॥పల్లవి॥ |
నిన్ను నేమి ననము నీతో సరస మాడము యెన్నటిపొందులు మాతో నేల నవ్వేవు సన్నలనే మొక్కితిమి చాయల దీవించితివి కిన్నెరమీట్ల నింకా గిలిగించవలెనా | ॥నాఁటి॥ |
ననుపువారము గాము నవ్వింపించుకో రాదు పనిలేనిపని యేల పట్టి తీసేవు తనీసితిమి మాలోనే తారుకాణ వచ్చె నీకు ఘనముగాఁ బాట వాడి కాఁక రేఁచవలెనా | ॥నాఁటి॥ |
సమ్మతించ లేదు నేము చవులు పుట్టించ రాము కమ్మరఁ గమ్మర నేల కాఁగిలించేవు యిమ్ముల శ్రీ వేంకటేశ యీడ నన్నుఁ గూడితివి చిమ్ముచు నేకతా లాడి సిగ్గు రేఁచవలెనా | ॥నాఁటి॥ |