శృంగార సంకీర్తన
రేకు: 747-3
సంపుటము: 16-273
రేకు: 747-3
సంపుటము: 16-273
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
ఇక్కువ దాఁటినమీఁద నేమి సేసేము చక్కని విభునిమీఁద చలముకోఁగలమా | ॥పల్లవి॥ |
వాడికెగా రమ్మంటి వచ్చీనో రాఁడో కాని యీడ వుంగరము నాకు నిచ్చి పోయను వేడుకకానిమనసు వేవేలచందాలఁ బారు తోడితేరే వద్దనుండి తియ్యలులాల | ॥ఇక్కు॥ |
తగిలి యాన వెట్టి తలఁచీనో లేదో కాని నగుతా నిమ్మపం డిచ్చె నాచేతికి మగవానివలపులు మ ట్టెరఁగఁగ రాదు తగిలి పిలువరే తరుణులాల | ॥ఇక్కు॥ |
పదివేలుగా మొక్కితి పరాకాయ నేమో కాని యెదుటనే సన్న సేసె యిప్పుడు నాతో కదిసి కూడెను శ్రీ వేంకటపతి యిదె నన్ను పొదిగి సేవ సేయరే పొలఁతులాలా | ॥ఇక్కు॥ |