శృంగార సంకీర్తన
రేకు: 749-3
సంపుటము: 16-285
రేకు: 749-3
సంపుటము: 16-285
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
వేగిర మేలే కొసరు వేరే వుండఁగా నా- తీగె కళల మోమైనా దెలిపించీఁ గాక | ॥పల్లవి॥ |
దాపగు నామనసే తల కెక్క వలపించె పాపము తన్నన నేలే బతుకుఁ గాక యేపున నిపు డేమాయ హృదయములోనుచొచ్చి చూపులు నావైనాఁ దను సూడువట్టీఁ గాక | ॥వేగిర॥ |
వెక్కసపు వయసే విరహము పెరరేచే పక్కన వాడు లింకేలే బతుకు గాక కక్కసము వలెనా ఘన మర్మములు రాఁగి చక్కదనము నాదైనా సాదించీ గాక | ॥వేగిర॥ |
వింతగు నావాపులే వీడు దొడు లాడించె పంతము దనతో నేలే బతుకు గాక అంతటి శ్రీవేంకటేశు డన్నిటా నన్ను గూడె యెంత కైనా నాచలమే యియ్యకొనీఁ గాక | ॥వేగిర॥ |