శృంగార సంకీర్తన
రేకు: 789-4
సంపుటము: 16-525
రేకు: 789-4
సంపుటము: 16-525
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
నెట్టనఁ గన్నియ యిది నీకాఁగిట నెదిగి చుట్టమయి పట్టమేలే సుదతి నీకాయ | ॥పల్లవి॥ |
ముప్పిరి నింతిచన్నులు మొలచిన నాఁటికి గొప్పలై తిప్పలై కొండలాయను యిప్పుఁ డిట్టె చూడఁగానె యీపెకన్నులుముత్తెపుఁ చిప్పలై విప్పలై చిలుకమ్ము లాయను | ॥నెట్టి॥ |
కారుకమ్మి నెరులివి కలికికొప్పులోనికి మూరలై బారలై మోపులాయను యీరీతిఁ దీరుగల దీపెపిరుఁ దింతలో బారమై తోరమై బండికండ్లాయను | ॥నెట్టి॥ |
భోగించునీలేమపొందైనకరములు సోగలై బాగులై తీగెలాయను యీగతి శ్రీవేంకటేశ యీకెచక్కఁదనాలు పోగులై లాగులై పూజలు నీకాయను | ॥నెట్టి॥ |