శృంగార సంకీర్తన
రేకు: 790-1
సంపుటము: 16-529
రేకు: 790-1
సంపుటము: 16-529
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
వచ్చె నదివో రమణుఁడు వాకిటి కోచెలులాల పచ్చిదేర నొక్కమాటే పలుకరే యిపుడు | ॥పల్లవి॥ |
వెలఁదికి వెలినున్న విభునిఁ దోడుకరాక చెలు లేమిచెప్పినాను చెవిఁ బట్టవు మలసి యాతనితోడ మాఁటలెల్లా నాడక పలుపుపచారాలు పనిరావు | ॥వచ్చె॥ |
చన్నులపై నాతనిమై సారె నప్పళించుకోక సన్న లెంత సేనినాను సమ్మతిగాదు కన్నుల నాతనిరూపు గక్కనఁ గనుఁగొనక వున్నతి మీరాకలకు వుల్లము గరఁగదు | ॥వచ్చె॥ |
తిరమై యాతనిమోవితేనె చవిచడక సరుగ మీకానుకలు సంగతిగావు యిరవై శ్రీవేంకటేశుఁ డితలోనె యీకెఁ గూడె వెరగయ్యీ మీనేర్పులు వెలితిలేవు | ॥వచ్చె॥ |