అధ్యాత్మ సంకీర్తన
రేకు: 12-5
సంపుటము: 1-76
రేకు: 12-5
సంపుటము: 1-76
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి[1]
ఎంతైన దొలఁగవై తేదైన నామతికి వింతచవి సేతుగా విషయబుద్ధి | ॥ఎంతైన॥ |
ఎనసి జన్మముల నే నెట్ల నుండినఁ బోక వెనకఁ దిరుగుదువు[2]గా విషయబుద్ధి అనువైన యనుభవన లనుభవించఁగఁ జేసి[3] వెనక మఱపింతుగా విషయబుద్ధి | ॥ఎంతైన॥ |
కెఱలి కాంతలు[4] నేనుఁ గినిసిననుఁ బొలయలుక విఱిచి కలపుదువుగా విషయబుద్ధి తఱితోడ వావివర్తన దలంచిన నన్ను వెఱపు దెలుపుదువుగా విషయబుద్ధి | ॥ఎంతైన॥ |
యెడలేని యాపదల నెట్లు బొరలిన నన్ను విడిచిపోవైతిగా విషయబుద్ధి సడిఁబెట్టి వేంకటస్వామికృపచే నిన్ను విడిపించవలసెఁగా విషయబుద్ధి | ॥ఎంతైన॥ |
[1] నిడురేకు 34- ధన్నాసి.
[2] నిడురేకు 34- దిరిగితిని.
[3] నిడురేకు 34- నించిన నన్ను.
[4] నిడురేకు 4- కాంతల.