శృంగార సంకీర్తన
రేకు: 32-4
సంపుటము: 17-191
రేకు: 32-4
సంపుటము: 17-191
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: శంకరాభరణం
తెలిసితి మింక నెంత తేలించేవే కలికివి పతి నెంత కారించేవే | ॥పల్లవి॥ |
తరితీపులే కావా తమకము వెంచేవీని శిరసుమొక్కులే కావా చిమ్మి రేఁచేవి సరసములే కావా చవులు వుట్టించేవీని తెరలో చూపులే కావా తెమలించేవి | ॥తెలిసితి॥ |
మంచి మాటలే కావా మక్కువలు వుట్టించేవి పొంచిన సిగ్గులే కావా పొడి సేసేవి మించుమురిపేలే కావా మిగులఁ జొక్కించేవి కొంచని బీరాలే కావా గుట్టు సేసేవి | ॥తెలిసితి॥ |
తనువుసోఁకులే కావా తగులమి సేసేవి ననుపురతులే కావా నమ్మించేవి యెరసి శ్రీవేంకటేశుఁ డిదె ని న్నలమేల్మంగ నినువు నీటులే కావా నెయ్యము సేసేవి | ॥తెలిసితి॥ |