Display:
శృంగార సంకీర్తన
రేకు: 35-3
సంపుటము: 17-208
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: ఆహిరి
దోయము లే దిందు కేమి దొడ్డవాఁడవు
ఆసల నెవ్వరైనా ని న్నాడుకొనేరా
॥పల్లవి॥
చెలరేఁగి యాపె నీపై సేసలు వెట్టఁగ వచ్చె
వలనుగా నీ శిరసు వంచవయ్యా
నలువంక నామాటకు నవ్వులు నవ్వేవు నీవు
కెలనివా రింతలో మొక్కితి వనేరా
॥దోము॥
కడఁగి అప్పటి నాపై కంకణము గట్ట వచ్చె
జడియక నీవు చేయి చాఁచవయ్యా
సిడిముడి యింతలో సిబ్చితిపడేవు నీవు
వొడికానఁ దమ్ములాన కొగ్గితి వనేరా
॥దోము॥
కూరిమి నలమేల్మంగ గుబ్బ లొత్తఁగ వచె
ఆరితేరి వురమున నానుకోవయ్యా
యీరీతి శ్రీవేంకటేశ యెనసియు లోఁగేవు
భారాన ని న్నిందరు మోపరి వనేరా
॥దోము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము