శృంగార సంకీర్తన
రేకు: 36-1
సంపుటము: 17-212
రేకు: 36-1
సంపుటము: 17-212
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: ఆహిరి
చెలులాల విభునికిఁ జెప్పరే బుద్ది యెలమి విూరిందరు న న్నేల బాదించేరే | ॥పల్లవి॥ |
కల్లనిదురలు వోఁగా కౌఁగిలించుకొందురటే మల్లాడఁగా మోవిచవి మనసౌనటే వుల్లాసము లేకుండఁగా వొడివట్టి యెల్లవారుఁ గూడి యిప్పు డేల బోదించేరే | ॥చెలులాల॥ |
బొమ్మల జంకించఁగాను పూఁచి విన్నవింతురటే యెమ్మెఁ బెనఁగఁగా వీడె మిత్తురటవే కమ్మి చప్పఁగా జూడఁగా కానుక లింపొందురటే యిమ్ముల న న్నిందుకుఁగా యేల బోదించేరే | ॥చెలులాల॥ |
సగ్గి నవ్వకుండగానుఁసరస మాడుదురటే సిగ్గునఁ దప్పించుకోఁగా చే చాఁతురటే అగ్గ మై శ్రీవేంకటేశుఁ డాతఁడే యిదె కూడె యెగ్గు లేదు యింకా మరి యేల బోదించేరే | ॥చెలులాల॥ |