శృంగార సంకీర్తన
రేకు: 84-2
సంపుటము: 17-443
రేకు: 84-2
సంపుటము: 17-443
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: ఆహిరి
ధారుణీపతికినిఁ దలఁబాలో - బహు- దారారతునకుఁ దలఁబాలో | ॥పల్లవి॥ |
హేమవర్ణునకు నిందిరాపతికి దామోదరునకుఁ దలఁబాలో సామజభయరక్షకునకు దులసీ ధామునకు హరికిఁ దలఁబాలో | ॥ధారుణీ॥ |
కలికిరుకిమిణికిఁ గడుఁ దమకించి తలదైవమునకుఁ దలఁబాలో మలసి సత్యభామకు బతిపంకజ దళనేత్రునకునుఁ దలఁబాలో | ॥ధారుణీ॥ |
తిరువేంకటమున దినపెండ్లిగల తరుణులపతికినిఁ దలఁబాలో యిరవుగ బాయక యిందిర నురమున ధరియించుహరికిఁ దలఁబాలో | ॥ధారుణీ॥ |