Display:
శృంగార సంకీర్తన
రేకు: 84-5
సంపుటము: 17-446
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: ముఖారి
ఎంత వొద్దు లేదు నీకు నేమి సేయరాదు నన్ను
మంతనమైనదాఁకా మన్నించరాదా
॥పల్లవి॥
నగి నగి యలపయ్యీ నవ్వుల నీ మాటలకు
మగటిమిఁ గొంతవడి మానరా యింక
చిగురించఁ జెనకఁగ సిగ్గయ్యీఁ గడుంగడు
వెగటు మానినదాఁకా విడువరాదా
॥ఎంత॥
చూచి చూచి సొడగిలి సొంపుల నీ చేఁతలెల్ల
తాచి తెరమాఁటుకైనా దలఁగరాదా
వాచవిమాటలాడఁగ వాడె నిదె నా మోవి
చేచేత దగ్గరుదాఁకా సెలవియ్యరాదా
॥ఎంత॥
కూడి కూడి నిద్ర వచ్చీఁ గూరిమి నీ రతులను
వూడనికౌఁగిట గొంత వుండఁగరాదా
జాడతో శ్రీవేంకటేశ సరుఁస బెండ్లాడితివి
యీడుజోడాడినదా కా నియ్యకొనరాదా
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము