శృంగార సంకీర్తన
రేకు: 84-6
సంపుటము: 17-447
రేకు: 84-6
సంపుటము: 17-447
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: రామక్రియ
ఏల మాను నిద్దరికి నిటువంటి పొందులు వేళాయఁ జెలికడకు విచ్చేయవయ్యా | ॥పల్లవి॥ |
చెలికన్నుల నంటెను సింగారపు నీరూపు నిలిచెఁ బాదములందు నీపై తమి వలపు శిరసు కెక్కె వనితకు నీకుఁగానే కలిగె నెన్నడుమను కందువ నీగుణము | ॥ఏల॥ |
యింతిమదిలోఁ బెరిగీ నిదె నీపై కోరికెలు పంతము చన్నుఁగొండలపై నాటెను వంతుకు నీవుంగరము వనితవేల నున్నది వింతాయ నీ విలువిద్య వెలఁదిబొమ్మలను | ॥ఏల॥ |
మగువ నీబుద్దు లెల్లా మనసాయ రతివేళ తగె నీ ప్రేమ కలికితనమునను నగుతా శ్రీవేంకటేశ నాతి గలసితి విట్టె పగటు లిద్దరికిని పాయమున నిలిచె | ॥ఏల॥ |