Display:
శృంగార సంకీర్తన
రేకు: 87-5
సంపుటము: 17-465
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: ఆహిరి
అక్కడివారినే నీవు అటు చెండుకోరాదా
మక్కవతో నీ వేల మాకు మొక్కేవయ్యా
॥పల్లవి॥
రానిచేఁత లివి చూచి కన్నులెఱ్ఱఁ గారాదా
తేనెమోవి యెంగిలయితేఁ దిట్టుకోరాదా
ఆనిన మచ్చా లుండఁగ నటుమోము గారాదా
మానవుగా నీ వేల వకు మొక్కేవయ్యా
॥అక్కడి॥
మొగి వింతవాసనకు ముక్కు మూసుకోరాదా
నొగరుమాటలు వింటె నొడ్డుకో రాదా
అగడయి బాస దప్పితే నటు లేచి పోరాదా
మగిడి మగిడి యాల మారు మొక్కేవయ్యా
॥అక్కడి॥
తారుకాణ లయితేను తల వంచుకోరాదా
మేర దప్పినపనికి మెచ్చరాదా
యేరా శ్రీవేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
నారుకొని యిఁక నేల నాకు మొక్కేవయ్యా
॥అక్కడి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము