Display:
శృంగార సంకీర్తన
రేకు: 801-1
సంపుటము: 18-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
ఏమని పొగడవచ్చు నిదివో నీ దేవులను
కామించి నీచిత్త మెంత గరఁగెనో కాని
॥పల్లవి॥
పలచని కెమ్మోవిఁ బలువరుసల కెంపు
దొలఁక మాఁటలాడిఁ దొయ్యలి
కలువరేకుఁ గన్నులఁ దళుకులు మెరువఁగా
సొలసీ నిన్నుఁ జూచి సొబగులు దేరును
॥॥
ముసిముసి నవ్వులతో మోమునఁ జంద్రకళలు
విసరుతా సిగ్గువడీ వెలఁ ది
పసిఁడి వన్నెల గుబ్బపాలిండ్లు గదలఁగా-
నోసగీ బాగాలు నీకు నుడివోనియాసల
॥॥
సోగకరములగోళ్ళు సోఁకకుండా నీకు నిట్టె
బాగుగఁ బాదాలోత్తీఁ బడఁతి
లాగుగ శ్రీవేంకటేశ లలితాంగిఁ గూడితివి
యీగతి రతిఁ జోక్కించీ నిట్టే నిన్ను నింపుల
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము