శృంగార సంకీర్తన
రేకు: 802-1
సంపుటము: 18-7
రేకు: 802-1
సంపుటము: 18-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
నీ వేల సిగ్గువడేవే నెలఁతా యీవలఁ జెలికత్తెల మెగసక్కె మాడేమా | ॥పల్లవి॥ |
చుక్కలవలె నీమోవి సూదివాటు లుండఁ గాను యిక్కున నీకెంగేల నేల మూసేవే తక్కుక గజరుఁజేఁతలవాఁ డు నీ మగడు యెక్కడా లేనిదా యందుకేమాయనే | ॥॥ |
నాటుకోని చెక్కుల పై నవచంద్రకళ లుండఁ గాను గాటవుఁ గస్తూ రెంతకడు మెత్తేవే మేటియైన నీ విభుఁడు మిక్కిలి నారజకాఁడు ఆఁటదానికిఁ గలదే యందుకేమాయనే | ॥॥ |
తగ నీమెయి నాడాడ తమ్మచదురు లుండఁగ పొగరుఁగుంకుమలేల పూసుకొనేవే జగములో శ్రీ వేంకటేశ్వరుఁడె జాజరకాఁడు అగపడి నిన్ను నేలె నందుకు నేమాయనే | ॥॥ |