అధ్యాత్మ సంకీర్తన
రేకు: 13-5
సంపుటము: 1-81
రేకు: 13-5
సంపుటము: 1-81
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
అప్పులవారే అందరును కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ | ॥అప్పుల॥ |
ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ జిక్కులు సిలుగులుఁ జింతలునే దిక్కెవ్వరు యీ తీదీపులలో దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక | ॥అప్పుల॥ |
యేది [1]దలంచిన నేకాలంబును[2] సూదులమూఁటల సుఖములివి కాదన నౌననఁ గడ గనిపించఁగ[3] పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే | ॥అప్పుల॥ |
యెన్నఁడు వీడీ [4]నెప్పుడు వాసీఁ బన్నిన తమతమ బంధములు వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు[5] | ॥అప్పుల॥ |
[1] ‘దలఁచిన’ అని రేకు.
[2] నిడురేకు 11లో- ఏది చూచినను ఇటువలెనేపో.
[3] నిడురేకు 11లో- నౌననఁ గర్తలు వేరీ.
[4] నిడురేకు 11లో- ఎన్నడు దీరీ.
[5] నిడురేకు 11లో- డేకాక.