Display:
శృంగార సంకీర్తన
రేకు: 826-5
సంపుటము: 18-155
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఏమి సేతు జెప్పవయ్య యేది నాకు నూడిగము
కామించి వచ్చితివి నా కడకు నేఁడిపుడు
॥పల్లవి॥
నిదుర గన్నుల దేరీ నిమ్మపండు దెత్తనా
చెదరినవి కురులు చిక్కుదీతునా
పెదవి గెంపులు నిండెఁ బేంట్లు రాలుతునా
మదమువలెఁ గారీఁ జెమటలు దుడుతునా
॥॥
బడలివున్నాఁడవు పన్నీరు చల్లుదునా
వెడలీ నిట్టూర్పులు విసరుదునా
తడఁబడి నడపు కై దండ నీకు నిత్తునా
కడువారె మేము బాగాలు చేతికిత్తునా
॥॥
భావ మెందో వున్నది పానుపు వరతునా
దైవారీఁ గళలు నీకద్దము దెత్తునా
శ్రీవేంకటేశ్వర నాసేవ మెచ్చి కూడితివి
నావు వొంటినున్నాఁడవు నేఁ దోడు వండుదునా
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము