Display:
శృంగార సంకీర్తన
రేకు: 827-3
సంపుటము: 18-159
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
కరఁగి యిందు కతఁడు కాఁగిలించుకొనవద్దా
ఇరవెఱింగేల యల‌ఇంచెనో కాక
॥పల్లవి॥
మోమునఁ జెమటగారీ మొక్కితేనే కొప్పు జారీ
యేమని వినయాలు పతి కెంతసేసేవే
కోమలపుదానవు సిగ్గులు నీకిఁకా నానపు
గోమున నేపొద్దుదాఁకాఁ గొలువునేసేవే
॥॥
చిగురాకు నీమోవి చెదరీఁ గమ్మనితావి
పొగడి పొగడి యెంత పొందుచూపేవే
దగదొట్టీ నూరుపులు దయరేఁ చీ నేరుపులు
నగవు లెందాఁకా నవ్వి నయములు చూసేవే
॥॥
సారెఁ బయ్యద వదలీ చనుఁగవ గదలీని
చేరి చేరి యెంతవడి సేవ సేసేవే
యీరీతి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
తారుచు నెం తాతనిచేఁతలకు లోనయ్యేవే
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము