శృంగార సంకీర్తన
రేకు: 832-6
సంపుటము: 18-192
రేకు: 832-6
సంపుటము: 18-192
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
పాసివున్న విరహపు బడలికేల చూచేవు వేసరక ఇచ్చకమే వేమారుఁ జేయవే | ॥పల్లవి॥ |
చెక్కునొక్కి బుజ్జగించి చెలుపుఁడు వేఁడుకొనీ మొక్కవే పాదాలకు మొగమెత్తి అక్కరతో నవ్వుమని ఆనవెట్టీఁ దనమీఁద మక్కళించి యతనితో మాటలాడవే | ॥॥ |
కొంచక తొడపై నిన్నుఁ గూచుండఁ బెట్టుకొనీ ముంచి వినయానఁ బ్రియములు చెప్పవే పొంచి తములమెల్లా నీపుక్కిటనిండాఁ బెట్టీ వంచనలెల్లాఁజేసి వలపులు చల్లవే | ॥॥ |
సారె శ్రీవేంకటేశుఁడు చన్నులపైఁ జేయిచాఁచీ గారవించి మోవితేనె కప్పమియ్యవే యీరీతి నిన్నుఁ గూడి యితవులెల్లాఁ జేసీ వూరడించి రతులను వోలలాడఁ జేయవే | ॥॥ |