అధ్యాత్మ సంకీర్తన
రేకు: 14-1
సంపుటము: 1-83
రేకు: 14-1
సంపుటము: 1-83
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఎందుఁ బొడమితిమో యెఱఁగము మా- కందువ శ్రీహరికరుణే కాక | ॥ఎందు॥ |
ఏఁటి జన్మమో యెఱఁగము పర- మేఁటిదో నే మెఱఁగము గాఁటపు కమలజుఁ గాఁచిన యీ నాఁటకుఁడే మా నమ్మిన విభుఁడు | ॥ఎందు॥ |
యెవ్వారు వేల్పులో యెఱఁగము సుర- లెవ్వరో నే మెఱఁగము రవ్వగు శ్రీసతిరమణుఁడు మా- కవ్వనజోదరుఁ డంతరియామి | ॥ఎందు॥ |
యింకా నేఁటిదో యెఱఁగము యీ - యంకెల బాముల నలయము జంకెల దనుజులఁ జదిపిన తిరు- వేంకటేశుఁడు మా విడువని విభుఁడు | ॥ఎందు॥ |