Display:
శృంగార సంకీర్తన
రేకు: 869-4
సంపుటము: 18-411
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రీతిగౌళ
వేడుకయ్యీ మీయిద్దరి వినోదాలుఁ జూడ మాకు
తోడనే వెూవిపై గురుతులు నించరాదా
॥పల్లవి॥
బలిమి చూతము గాని పతిచెక్కులమీఁదట
ములువాఁడి కొసగోరు మోపరాదా
మలసి నీవతనిమర్మ మెరుఁగురు నందువు
కిలకిలనవ్వే అట్టు గిలిగించరాదా
॥॥
యెట్టిదో నీచనవు నే నెరిఁగేఁ గాని యతని
దిట్టవై పచ్చితిట్లు తిట్టఁగరాదా
ముట్టిన మీజాణతనములు గానవచ్చీఁ గాని
గుట్టుతోడ పూబంతిఁ గొని వేయరాదా
॥॥
మెచ్చును నీపగటు యెమ్మెలకు శ్రీ వేంకటేశు
యెచ్చరికగాఁ బాదాన లచ్చించరాదా
యిచ్చ నలమేల్మంగనయుననన్నుఁ గూడే నాతఁ
డిచ్చకుఁడై నిన్ను నేలె నెమ్మె చూపరాదా
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము