Display:
శృంగార సంకీర్తన
రేకు: 870-1
సంపుటము: 18-414
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
గోవులఁ గాచి యలసీ గోవిందుఁడు
గోవాళితనాలు సేసీ గోవిందుఁడు
॥పల్లవి॥
పానుపు మీఁ దటఁ దాను పవళించి వున్నవాఁడు
గోనాలగొంది నిదె గోవిందుఁడు
ఆనుక చేతులు చాఁచీ నట్టె చన్నులమీఁద
పూని యేదోనుండి వచ్చి భోగించీ గోవిందుఁడు
॥॥
బట్టబాయిట నింతులఁ బాదాలు విసుకుమనీ
గుట్టు సేయఁ డించుకంతా గోవిందుఁడు
జట్టిగొని మోవితేనే సారెకు నియ్యఁగ వచ్చి
చుట్టమువలెనే వచ్చి సొలసీ గోవిందుఁడు
॥॥
యెలమిఁ దెరవేసుక ఇద్దరిఁ గాఁగిటఁ గూడీ
కొలువు లోపలనే గోవిందుఁడు
వెయ గొల్లెతలము వేడుకతో మమ్ము నేలె
అలరిన శ్రీవేంకటాద్రి గోవిందుఁడు
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము