Display:
శృంగార సంకీర్తన
రేకు: 870-2
సంపుటము: 18-415
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఇంకనేల మరఁగులు ఇన్నియు బా‌ఇటఁ(బాయిటఁ) బడె
సంకెలేక ఇంతలోనే చన్నులంటఁ గాను
॥పల్లవి॥
రవ్వలాయ నావలపు రామలెల్లా నెరిఁగిరి
నవ్వు లీడనే నీవు నాతో నవ్వఁ గా
జవ్వనులు తమలోన సన్నలు చేసుకొనిరి
పువ్వులవాట్ల నీవు పొంచి వేయఁ గాను
॥॥
పచ్చిదేరె నావయసు పనులు వెల్లవిరాయ
విచ్చనవిడిని నీవు విడెమియ్యఁగా
కచ్చు పెట్టి సవతులు కడువెంగే లాడేరు
మచ్చికల నీవు నాతో మాటలాడఁ గాను
॥॥
తగులాయ నీకు నాకు తలపోఁత లీడేరే
తగవుతో నీవు నన్ను దయఁ జూడఁ గా
మిగులా నాతోడివారు మెచ్చేరు శ్రీవేంకటేశ
మగఁడవై పలుమారు మన్నించఁ గాను
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము