అధ్యాత్మ సంకీర్తన
రేకు: 14-5
సంపుటము: 1-87
రేకు: 14-5
సంపుటము: 1-87
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
పారితెంచి యెత్తివేసి పారవెళ్లితిని(వి?) నీరసపు టెద్దవైన నీకు నే ముద్దా | ॥పారి॥ |
ఎద్దవై నన్నేల తొక్కి యేమి గట్టుకొంటివి వొద్దనైన వచ్చి వూరకుండవైతివి వొద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాక నిద్దురచిత్తముతోడినీకు నే ముద్దా | ॥పారి॥ |
కాఁపురపుఁ బాపపు నా కర్మమును [1]ధరించి వీఁపు వగులఁగ[2] దాకి విఱ్ఱవీఁగితి ఆఁపఁగ నెద్దేమెఱుంగు నడుకుల చవి మూట- మోపరివి నీకు నాముదము ముద్దా | ॥పారి॥ |
మచ్చరించి అల్లనాఁడు మాలవాఁడు కాలఁదన్ని తెచ్చినయప్పటి ధర్మదేవతవు యెచ్చరించి తిరువేంకటేశుదాసుఁడని నన్ను మెచ్చి తాఁకితివి నా మేను నీకు ముద్దా | ॥పారి॥ |
[1] ‘నుద్ధరించి’ అని పూ.ము.పా.
[2] ‘వగుల దాఁకి’ అని పూ.ము.పా.