Display:
శృంగార సంకీర్తన
రేకు: 914-2
సంపుటము: 19-74
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వేళావళి
తగుతగు నీదొరతనము లిఁక
వెగటులన్నియును వేడుకలాయ
॥పల్లవి॥
విరసపుతిట్లు వేవేలు దిట్టిన
సరసపువేళల చవులాయ
యెరవులచేఁత నీవేమి సేసినా
సరి నాకాఁగిట చందములాయ
॥॥
బొమ్మజం కెనలు పొరి నెన్నైనా
సమ్మతించితే చవులాయ
దిమ్మరివై యెందు దిరిగినచ్చినా
నెమ్మి నన్నేలఁ గా నేరుపులాయ
॥॥
అంగము లలయఁగ నంటఁబెనఁగినా
సంగడిరతులను చవులాయ
రంగు శ్రీ వేంకటరమణ నన్నెనసితి-
వెంగిలిమోవుల కిచ్చకమాయ
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము