శృంగార సంకీర్తన
రేకు: 914-5
సంపుటము: 19-77
రేకు: 914-5
సంపుటము: 19-77
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
వలపేమి వెగటా వనితలకు చిలుకుగోళ్ళనేల చెమట చిమ్మేవే | ॥పల్లవి॥ |
అదనెరిఁగి పచ్చిమాటాతఁడు నిన్నాడితేను వదనకమల మేల వంచేవే సదరానఁ గప్పురము చన్నుదాఁక వేసితేను వుదుటున లోలోన వుసురనేవేలే | ॥॥ |
చవులువుట్టిం చాతఁడు సన్న నీకుఁ జేసితేను అవలివలై యేల అలసేవే తివిరి యట్టె ముసుఁగు దీసి మోము చూచితే జవళిఁ జొక్కుచు నేల జడిసేవే | ॥॥ |
శ్రీ వేంకటేశుఁడు నిన్నుఁ జేరి కాఁగిలించితేను భావము గరఁగి యెంత పదరేవే కావరపునవ్వుతోడఁ గడుసరసమాడితే చేవదేర నెంతకెంత చెలఁగేవే | ॥॥ |